బేలలో సోయా కొనుగోలు చేయకపోవడంతో బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో జాతీయ రహదారిపై ఆందోళన
బీఆర్ఎస్ శ్రేణులతో కలిసి పాల్గొన్న మాజీమంత్రి జోగు రామన్న చిత్రం న్యూస్, బేల :ఆదిలాబాద్ జిల్లా బేల మండలం కేంద్రంలో సబ్ మార్కెట్ యార్డులో మార్కెట్ అధికారులు సోమవారం సోయా కొనుగోలు ప్రారంభిస్తామని చెప్పి మాట తప్పడంతో బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ఆందోళన చేపట్టారు. సోయా రైతులు ఎదుర్కొంటున్న సమస్యలపై మాజీ మంత్రి జోగు రామన్న బీఆర్ఎస్ పార్టీ శ్రేణులతో కలిసి సోయా పంటను చూపిస్తూ బేల జాతీయ రహదారిపై రాస్తారోకో నిర్వహించి రైతు సమస్యలు పరిష్కరించాలని...