ఏకగ్రీవంగా సమృద్ధి పాల ఉత్పత్తిదారుల సహకార సంఘం ఎన్నికలు
చిత్రం న్యూస్, భీంపూర్: సమృద్ధి పాల ఉత్పత్తిదారుల సహకార సంఘం భీంపూర్ ఎన్నికలను శనివారం నిర్వహించారు. రాష్ట్ర సహకార ఎన్నికల అథారిటీ హైదరాబాద్ ఎన్నికల అధికారిగా ఆదిలాబాద్ జిల్లా సహకార కార్యాలయం సీనియర్ ఇన్స్పెక్టర్ ఎ.నవీన్ కుమార్ ను నియమించారు. భీంపూర్ లోని సంఘ భవనంలో ఎన్నికలు నిర్వహించగా సొసైటీలో (09) డైరెక్టర్ పోస్టు లకు ( 09) మంది సభ్యులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. అధ్యక్షులుగా మెస్రం దీపీక, సహ అధ్యక్షులుగా మెస్రం నాగమ్మ, కార్యదర్శిగా ఆత్రం...