Chitram news
Newspaper Banner
Date of Publish : 25 October 2025, 10:07 am Editor : Chitram news

వైభవోపేతంగా భావుబీజ్ వేడుకలు 

చిత్రం న్యూస్, బేల: సోదర అనుబంధానికి, అనురాగాలకు ప్రతీగా నిలిచే భావుబీజ్ వేడుకలను శుక్రవారం వైభవోపేతంగా నిర్వహించుకున్నారు. దీనిని మహారాష్ట్ర, గోవా, మరియు గుజరాత్‌లలో భావుబీజ్ అని పిలుస్తారు, ఇది “భాయ్ దూజ్” కు మరొక పేరు. మహారాష్ట్రలోని ఈ పండగను ఆనందోత్సాహాల నడుమ ఘనంగా జరుపుకోగా సరిహద్దులోని ఇక్కడి ప్రాంత మరాఠీ ప్రజలు జరుపుకోవడం  ఆనవాయితీగా వస్తుంది. ఆదిలాబాద్, బేల, జైనథ్,  భీంపూర్ మండలాల్లో ఈ పండగను వేడుకగా నిర్వహించారు. అక్కాతమ్ముడు, అన్నాచెల్లెల్ల అనుబంధాన్ని చాటుతూ వేడుకలు  నిర్వహించగా సోదరీమణులు పుట్టింటికి వచ్చి అన్నదమ్ములకు హారతి ఇచ్చి ఆశీర్వదించారు. సోదరులు వారికి కానుకలు అందజేసి తమ ప్రేమను చాటుకున్నారు. భావు బీజ్ వేడుకలు నెల రోజుల పాటు కొనసాగనున్నాయి.