Chitram news
Newspaper Banner
Date of Publish : 24 October 2025, 3:57 pm Editor : Chitram news

సహృదయ్ యాదవ్ కు ఎంబీబీయస్ సీటు

విద్యార్థులకు విందు భోజనం ఏర్పాటు

చిత్రం న్యూస్, సాత్నాల: ఆదిలాబాద్ జిల్లా సాత్నాల మండలంలోని జామిని ప్రాథమికోన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు శరత్ కుమార్ యాదవ్ కుమారుడు సహృదయ్ యాదవ్ కు యం. ఎంబీబీఎస్ లో సీటు వచ్చిన సందర్బాన్ని పురస్కరించుకొని ఆనందాన్ని వ్యక్తం చేస్తూ విద్యార్థులకు, ఉపాధ్యాయులకు, సిబ్బందికి స్వీట్స్, పసందైన చికెన్ తో కూడిన విందుభోజనం ఏర్పాటు చేసి సంతోషాన్ని అందరితో పంచుకున్నారు. ప్రధానోపాధ్యాయులు శరత్ కుమార్ యాదవ్ మాట్లాడుతూ.. మా పెద బాబు సహృదయ్ యాదవ్ కు ప్రభుత్వ  మెడికల్ కళాశాలలో ఎంబీబీఎస్  సీటు వచ్చింది అని అన్నారు. పాఠశాల విద్యార్థులకు చదువు యొక్క విలువను తెలియజేయడం జరిగింది అని అన్నారు. డాక్టర్ కావడం మా బాబు కల అని, గిరిజనులకు, పేదలకు సేవ చేయాలనే  లక్ష్యం ఉందని అని అన్నారు. నా సంతోషాన్ని మీతో పంచుకోవడం చాలా ఆనందం ఉంది అని అన్నారు. మా బాబులాగా మరింత ఉన్నతంగా ఎదగాలని విద్యార్థులకు సూచించారు. భవిష్యత్తులో జామిని గ్రామంలో మెడికల్ క్యాంపు ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. విద్యార్థులకు విందు భోజనం ఏర్పాటు చేయడం సంతృప్తిని ఇచ్చింది అని ఆయన అన్నారు. ఉపాధ్యాయులు జ్యోతి, జయశ్రీ,  లక్ష్మణ్, దూస గంగన్న, పెంటపర్తి ఊశన్న, మూనాహిద్,మోహిజే పోచ్చిరాం తదితరులు పాల్గొన్నారు.