Chitram news
Newspaper Banner
Date of Publish : 24 October 2025, 3:32 pm Editor : Chitram news

వంతెన పైనుంచి ట్రాక్టర్ బోల్తా

వంతెన పైనుంచి ట్రాక్టర్ బోల్తా

*ఒకరికి తీవ్రగాయాలు, మరొకరికి విరిగిన కాలు

*తప్పిన పెను ప్రమాదం

చిత్రం న్యూస్, బాసర: నిర్మల్ జిల్లా  ముథోల్ నుంచి అబ్దుల్లాపూర్ వెళ్లే రహదారిలో  వంతెన పైనుంచి ట్రాక్టర్ బోల్తా పడడంతో  ఒకరికి తీవ్ర గాయాలు కాగా మరొకరికి కాలు విరిగింది. ఈ ఘటన శుక్రవారం మధ్యాహ్నం బోరేగాం నుంచి వడతల్ వెళ్తున్న క్రమంలో చోటుచేసుకుంది. వంతెన పైనుంచి ట్రాక్టర్ బోల్తా పడడంతో తీవ్రగాయాల పాలైన క్షతగాత్రులను  ప్రభుత్వ ఏరియా హాస్పిటల్ కి తరలించారు. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.