చిత్రం న్యూస్, ఆదిలాబాద్: లారీ ఓనర్లకు తన అండదండలుంటాయని ఆదిలాబాద్ కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ ఇంఛార్జి కంది శ్రీనివాస రెడ్డి అన్నారు. ఎప్పుడు ఏ సమస్య వచ్చినా తన దృష్టికి తేవాలని అన్నివేళలా అండగా ఉంటానని వారికి భరోసానిచ్చారు. బుధవారం ఆదిలాబాద్ పట్టణంలోని జిల్లా లారీ ఓనర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ నూతన కార్యవర్గం ఎన్నిక సందర్భంగా కార్యాలయాన్ని సందర్శించారు. ఆయనకు వారు ఘన స్వాగతం పలికి శాలువాలతో సత్కరించారు. ఎవరి బెదిరింపులకు భయపడవద్దని కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. మనందరి లక్ష్యం రాహుల్ గాంధీని ప్రధాన మంత్రిగా చేయడమేనన్నారు. దాంతో పాటు స్థానిక ఎన్నికల్లో విజయం సాధించడం కోసం కష్టపడి పని చేయడమన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు గిమ్మ సంతోష్ రావు, లోక ప్రవీణ్ రెడ్డి, మునిగెల విట్టల్, రఫిక్, రోహిత్ షిండే, షఖీల్, శరత్, నరేష్, సోమ ప్రశాంత్, తోఫిక్,అంజాద్, ఆదిలాబాద్ జిల్లా లారీ ఓనర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ప్రెసిడెంట్ ఫహీం ఖాద్రి, ప్రధాన కార్యదర్శి సందీప్, కోశాధికారి నయీముద్దీన్, వర్కింగ్ ప్రెసిడెంట్ అక్బర్ షరీఫ్, ఉపాధ్యక్షులు సయ్యద్ సిరాజ్, జాయింట్ సెక్రటరీ మోహిసిన్ అహ్మద్, సభ్యులు అమర్, అబ్దుల్ అజీజ్, వాహెద్, లతీఫ్ తదితరులు పాల్గొన్నారు.

