Chitram news
Newspaper Banner
Date of Publish : 22 October 2025, 3:16 pm Editor : Chitram news

సోయా పంట కొనుగోలు చేయాలంటూ రోడ్డెక్కిన రైతులు

చిత్రం న్యూస్, బోథ్: సోయా పంట కొనుగోలు చేయాలంటూ బుధవారం రైతులు రోడ్డెక్కారు. ఆదిలాబాద్ జిల్లా బోథ్ మండల కేంద్రంలోని బస్టాండ్ వద్ద రైతులు ధర్నా చేపట్టారు. చేతికొచ్చిన సోయా పంట గత 20 రోజుల నుండి స్థానిక మార్కెట్ యార్డ్ లో తేమ శాతం లేకుండా ఆరబెట్టి మార్కెట్ యార్డు లో సోయా పంట నిల్వలు పేరుకపోవడంతో కనీసం మార్కెట్ యార్డ్ లో కూడా సోయా పంట తీసుకువద్దామన్న కూడా స్థలం కూడా లేదని ప్రభుత్వం ఒకపక్క రైతు ప్రభుత్వం అంటూ మోసాలు చేస్తుందన్నారు. కనీసం పండించిన పంట అమ్ముకుందామన్నా కూడా కనీసం ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదని, ఆరుగాలం కష్ట పడి పండించిన పంటను ప్రభుత్వం కొనుగోలు చేపట్టడం లేదన్నారు. ఒక పక్క రబీకి పంట సాగు చేయాలో లేక సోయా పంట కోసం రాత్రింబవళ్ళు మార్కెట్ యార్డులోనే ఉండవలసి వస్తుందని వెంటనే సోయా పంటను కొనుగోలు చేయాలని రైతులు డైమండ్ చేశారు. మాజీ ఎంపీపీ తుల శ్రీనివాస్ మాట్లాడుతూ. సోయా పంట కొనుగోలు చేయాలని, అదే విధంగా అకాల వర్షాల వల్ల పంట దిగుబడి రాలేదని నష్ట పోయిన ప్రతి రైతుకు  రూ.10 వేల సహాయంతో పాటు వరి పంటకు ఏవిధంగా అయితే 500 రూ. బోనస్ ఇస్తుందో అదే విధంగా మా ప్రాంతంలో పండిస్తున్న , పత్తి, సోయా, మొక్క జొన్న, కందులు, పెసర్లు, మినుములకు 500 రూ. బోనస్ ప్రకటించాలని అన్నారు. రెండు మూడు రోజుల్లో సోయా పంట కొనుగోళ్లు జరపాలని లేని పక్షంలో రైతులందరం ఏకమై ఉద్యమాలు చేస్తామని సూచించారు. ఈ ధర్నా కార్యక్రమంలో బోథ్ మండల రైతులు, ఇట్టేడి మోహన్ రెడ్డి, బోడ్డు శ్రీనివాస్, కొట్టాల రమేష్ రెడ్డి , సోమ శంకర్, నోముల ప్రభాకర్ రెడ్డి, రాజారాం, చాంద్ బాషా, రైతు వేదిక అధ్యక్షుడు బొర్రన్న, శ్రీధర్ రెడ్డి, అల్లకొండ ప్రశాంత్, సోయాబీన్ పంట రైతులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.