Chitram news
Newspaper Banner
Date of Publish : 22 October 2025, 11:10 am Editor : Chitram news

అక్టోబర్ 27 నుంచి పత్తి కొనుగోళ్లు ప్రారంభం

చిత్రం న్యూస్, ఆదిలాబాద్: జిల్లాలోని పత్తి రైతులకు శుభవార్త .అక్టోబర్ 27 సోమవారం నుంచి ఆదిలాబాద్ వ్యవసాయ మార్కెట్ యార్డులో సీసీఐ (CCI) మరియు ప్రైవేట్ వ్యాపారులచే పత్తి కొనుగోళ్లు ప్రారంభం కానున్నాయి.కనీస మద్దతు ధర (MSP) 2025-26 సంవత్సరానికి గాను కేంద్ర ప్రభుత్వం పత్తికి క్వింటా కనీస మద్దతు ధర రూ. 8,110 గా నిర్ణయించింది.

*కొనుగోలు నియమాలు: ఈ సంవత్సరం సీసీఐ కొనుగోలు నియమ నిబంధనల ప్రకారం.. రైతులు తమ పత్తిని సీసీఐకి విక్రయించాలంటే మార్కెట్ యార్డుకు రాకముందే ‘Kapas Kisan’ యాప్ ద్వారా జిన్నింగ్ మిల్లును ఎంపిక చేసుకొని స్లాట్ బుకింగ్ చేసుకోవాలి. స్లాట్ బుకింగ్ తేదీ నిర్ధారణ అయిన తర్వాత మాత్రమే మార్కెట్ యార్డుకు లేదా సీసీఐ సెంటర్‌కు రావాల్సి ఉంటుంది. ఆదిలాబాద్‌లోని A మరియు B సెంటర్‌లలో రైతులు పత్తిని సీసీఐకి అమ్ముకోవడానికి, ‘Kapas Kisan’ యాప్‌లో జిన్నింగ్ మిల్లుల ఎంపిక కోసం అక్టోబర్ 24 2025 నుండి స్లాట్‌లు అందుబాటులో ఉంటాయని సీసీఐ బ్రాంచ్ మేనేజర్ తెలిపారు. రైతులు ఖచ్చితంగా స్లాట్ బుకింగ్ నిర్ధారణ చేసుకున్న తర్వాత మాత్రమే పత్తి అమ్మకానికి మార్కెట్ యార్డుకు రావాలని సూచించారు.

*తేమ శాతం ఆధారంగా ధరలు: నాణ్యత ప్రమాణాల ప్రకారం, తేమ శాతం ఆధారంగా పత్తి ధరలు ఈ విధంగా ఉన్నాయి:

8%: రూ. 8,110.00

9%: రూ. 8,028.00

10%: రూ. 7,947.80

11%: రూ. 7,866.70

12%: రూ. 7,785.60