Logo
LIVE
హోం తెలంగాణ ఆంధ్రప్రదేశ్ ఆదిలాబాద్ కరీంనగర్ పెద్దాపురం అమరావతి కాకినాడ
✖ Close హోం

 -Advertisement-

వైద్య వృత్తిలో రాణించి పేదలకు సేవలందించాలి: ఎమ్మెల్యే పవార్ రామారావ్ పటేల్

అనసూయ పవార్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఎంబీబీఎస్ సీటు సాధించిన విద్యార్థులకు సన్మానం 

చిత్రం న్యూస్, బాసర: నిర్మల్ జిల్లాలోని మన బైంసా ప్రాంత విద్యార్థులు ఎంబీబీఎస్ లో సీటు సాధించడం అభినందనీయమని, వైద్య వృత్తిలో రాణించి పేదలకు సేవ చేయాలని ఎమ్మెల్యే పవార్ రామారావ్ పటేల్ సూచించారు. మంగళవారం భైంసాలోని ఎస్ఎస్ జిన్నింగ్ ఫ్యాక్టరీలో అనసూయ పవార్ ట్రస్ట్ ఆధ్వర్యంలో నియోజకవర్గంలో 25 మంది విద్యార్థులు ఎంబీబీఎస్ లో సీటు సాధించిన సందర్భంగా వారిని శాలువాతో సత్కరించి అభినందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా వైద్యులు అవసరమని, భవిష్యత్తులో డాక్టర్లు అయ్యాక గ్రామీణ ప్రాంతాల్లో వైద్య సేవలు విస్తరించాలన్నారు. జీవితంలో ఎంత ఎత్తుకు ఎదిగిన తల్లిదండ్రులను విస్మరించవద్దన్నారు. తల్లిదండ్రులు దైవంతో సమానులని, పిల్లల కోసం వారి ఎండనక, పగలనక శ్రమిస్తా రన్నారు. భైంసా ఏరియా ఆసుపత్రిని మరింత అభివృద్ధి పరుస్తానని ఆయన ఈ సందర్భంగా చెప్పారు. విద్యతోనే సమాజ అభివృద్ధి జరుగుతుందన్నారు. విద్యార్థులు తమ లక్ష్యాన్ని సాధించడం ఎంతో సంతోషంగా ఉందన్నారు.

అనుకున్న రంగంలో రాణించాలి

ప్రముఖ అంకాలజిస్ట్ డాక్టర్ సతీష్ పవార్, ఏరియా ఆసుపత్రి సూపరిండెంట్ డాక్టర్ కాశీనాథ్, వైద్యులు అనిల్ పద్మావతి మాట్లాడుతూ.. వైద్యరంగంలో ఎన్నో విప్లవాత్మక మార్పులు వచ్చాయని భవిష్యత్తులో అనుకున్న రంగంలో సక్సెస్ అయి వైద్య సేవలు చేపట్టాలని సూచించారు. మండల విద్యాధికారులు సుభాష్, చంద్రకాంత్, ఉపాధ్యాయ సంఘ నాయకులు బి.వి.రమణారావ్, వినోద్, శంకర్, భాజిరెడ్డి, శ్రీనివాస్ గంగాధర్ తో  పాటు పలువురు మాట్లాడుతూ..  గత పది సంవత్సరాలుగా విద్యారంగాన్ని అభివృద్ధి పరచడానికి అనసూయ పవార్ ట్రస్ట్ ఆధ్వర్యంలో చేపడుతున్న కార్యక్రమాలు అభినందనీయమన్నారు. కార్యక్రమంలో విద్యార్థులు తమ అనుభవాలు పంచుకున్నారు. విద్యార్థుల తల్లిదండ్రులు సంతోషాన్ని వ్యక్తం చేశారు. కార్యక్రమంలో రిటైర్డ్ డిఎఫ్ఓ దత్తురామ్ పటేల్, సీనియర్ నాయకులు సొలంకి భీమ్ రావ్ తో పాటు పలువురు నాయకులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Recent Comments