చిత్రం న్యూస్,బేల: దీపావళి పండగను ప్రజలు ఆనందోత్సవాల మధ్య ఘనంగా జరుపుకున్నారు. తెల్లవారుజామున ఇళ్ల ముందు రంగవల్లులు వేశారు. వ్రతాలు పూజలతో అందరి ఇళ్ళలో సందడి నెలకొంది. మంగళవారం గోమాతకు పూజలు నిర్వహించి నైవేద్యం సమర్పించారు. టపాసుల కాంతులతో పల్లెలు దద్దరిల్లాయి.