బాసర ఆలయ ఈవో అంజనీదేవికి రూ.లక్ష విరాళం అందజేస్తున్న మినుమనూరి శేఖర్ పుష్పలత దంపతులు
చిత్రం న్యూస్, బాసర: నిర్మల్ జిల్లా బాసరలోని పవిత్ర పుణ్యక్షేత్రం శ్రీ జ్ఞాన సరస్వతి దేవి అమ్మవారి శాశ్వత అన్నదాన సత్రం నిమిత్తం ప్రకాశం జిల్లా ఒంగోలుకు చెందిన మినుమనూరి శేఖర్ పుష్పలత దంపతులు రూ.లక్ష విరాళం అందజేశారు. ఆలయ కార్యాలయంలో ఆలయ ఈవో అంజనీదేవికి సోమవారం ఈ నగదును విరాళంగా అందజేశారు. ఈ సందర్భంగా విరాళం అందజేసిన దంపతులచే ఆలయంలో ప్రత్యేక పూజలు జరిపించి, ఆశీర్వచన మండపంలో వేద పండితులచే ఆశీర్వచనం అందించారు. అనంతరం వారికి అమ్మవారి ప్రసాదం అందజేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ సిబ్బంది, వైదిక బృందం తదితరులు పాల్గొన్నారు.
