Chitram news
Newspaper Banner
Date of Publish : 20 October 2025, 1:03 pm Editor : Chitram news

దీపావళి పండగ ఎందుకు జరుపుకుంటారు

దీపావళి పండగ ఎందుకు జరుపుకుంటారు 

చిత్రం న్యూస్, హైదరాబాద్: చీకటిపై వెలుగు, చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రతీకగా జరుపుకునే  ముఖ్యమైన పండగ దీపావళి. ఈ పండగను వెలుగుల పండగగా కూడా పిలుస్తారు.  సాధారణంగా ఇళ్లను దీపాలతో, పూలతో, విద్యుద్దీపాల కాంతులతో అలంకరించి, బాణాసంచా కాల్చి సంబరాలు చేసుకుంటారు. బహుమతులు, స్వీట్లు ఇచ్చిపుచ్చుకుంటూ వేడుకలు జరుపుకుంటారు. “దీపావళి” అనే పదం సంస్కృత పదం.”దీపావళి”  అంటే “దీపాల వరుస” అని అర్థం. చీకటిపై వెలుగు, అజ్ఞానంపై జ్ఞానం, చెడుపై మంచి విజయం సాధించిన రోజుగా చెబుతుంటారు. ఈ పండగను హిందూ మతంతో పాటు జైన మతం, సిక్కు మతాలలో కూడా నిర్వహిస్తారు.

దీపావళి ప్రాముఖ్యత: శ్రీకృష్ణుడు నరకాసురుడిని ఓడించిన విజయం ద్వారా చెడుపై మంచి సాధించిన విజయానికి గుర్తుగా దీపావళిని జరుపుకుంటారు. రావణుడిని ఓడించి 14 సంవత్సరాల వనవాసం తర్వాత రాముడు తిరిగి వచ్చిన సందర్భంగా కూడా దీపావళిని జరుపుకుంటారు.