బాసరలో ఘనంగా చంద్రమౌళీశ్వర ఆలయ ప్రతిష్ట, కుంభాభిషేక మహోత్సవం
చిత్రం న్యూస్, బాసర: నిర్మల్ జిల్లా బాసరలోని చంద్రమౌళీశ్వర ఆలయంలో శృంగేరి పీఠం జగద్గురువు శ్రీశ్రీశ్రీ విదుశేఖర భారతి మహాస్వామి వారిచే శ్రీ లలిత చంద్రమౌళీశ్వర ఆలయ ప్రతిష్ట కుంభాభిషేక మహోత్సవం మహాపూజా కార్యక్రమం అత్యంత వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ద్వాదశ జ్యోతిర్లింగాలు ,స్పటిక లింగం ప్రాణప్రతిష్ట మహోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ విశేష పూజా కార్యక్రమంలో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని అమ్మవారి దర్శనంతో పాటు శృంగేరి విదుశేఖర భారతి స్వామి వారిని దర్శించుకుని తీర్థ ప్రసాదలను స్వీకరించి ఆశీస్సులను తీసుకున్నారు. కార్యక్రమంలో ముథోల్ ఎమ్మెల్యే పవార్ రామరావ్ పటేల్, నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్ సూర్యనారాయణ గుప్తా పాల్గొని శ్రీ జ్ఞాన సరస్వతి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు.
