Chitram news
Newspaper Banner
Date of Publish : 19 October 2025, 7:21 am Editor : Chitram news

మొక్క జొన్న కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్

మొక్క జొన్న కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్

చిత్రం న్యూస్, బోథ్ : ఆదిలాబాద్ జిల్లా బోథ్ మండల కేంద్రంలోని వ్యవసాయ మార్కెట్ యార్డ్ లో మొక్క జొన్న కొనుగోలు కేంద్రాన్ని బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ ఆదివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రైతుల మీద ఈ ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదని అన్నారు. మొక్క జొన్నతో పాటు సోయాబీన్, పత్తి కొనుగోలు కేంద్రాలను వెంటనే ప్రారంభించాలని అన్నారు.  కిసాన్ కపాస్ యాప్ ద్వారా రైతులకు చాలా ఇబ్బందులు వస్తున్నాయని, ఆ యాప్ ఇప్పుడే అమలు చేయకుండా క్రమ క్రమంగా యాప్ మొదలు పెట్టాలని అన్నారు. చాలా మంది రైతుల వద్ద ఆండ్రాయిడ్ సెల్ ఫోన్లు లేవు.. ఉన్న నెట్వర్క్ ఉండవు. ఒకటి రెండు సంవత్సరాలు పాత పద్ధతి ద్వారానే పత్తి కొనుగోలు చేయాలని అన్నారు. పత్తి, సోయా,మొక్క జొన్న, శనగ, వేరు శనగ పంటలకు కూడా బోనస్ ఇవ్వాలన్నారు. అదేవిధంగా రైతులు ఎవరుకూడా దళారులకు పంటలు అమి మోసపోవద్దని, అని ప్రభుత్వంతో పోరాడి కొనుగోలు కేంద్రాలను ప్రారంభించే విధంగా చేస్తానని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మండల BRS పార్టీ నాయకులు, అధికారులు, రైతులు,  కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.