ఆదిలాబాద్ బీసీ సంఘాల బంద్ కు కాంగ్రెస్ పార్టీ మద్దతు
తెలంగాణ కిసాన్ కాంగ్రెస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బోరంచు శ్రీకాంత్ రెడ్డి ఆధ్వర్యంలో కాంగ్రెస్ శ్రేణుల బైక్ ర్యాలీ
చిత్రం న్యూస్, ఆదిలాబాద్:
తెలంగాణ రాష్ట్ర బీసీ జాయింట్ యాక్షన్ కమిటీ ఆధ్వర్యంలో, 42 శాతం బీసీ రిజర్వేషన్ల సాధన కోసం శనివారం చేపట్టిన బంద్ విజయవంతం అయ్యింది. ఇందులో భాగంగా ప్రజలు స్వచ్చందంగా బంద్ పాటించి బీసీ బిల్లుకు తమ మద్దతును తెలిపారు. ఈ సందర్భంగా తెలంగాణ కిసాన్ కాంగ్రెస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బోరంచు శ్రీకాంత్ రెడ్డి, టీపీసీసీ మాజీ ప్రధాన కార్యదర్శి గండ్రత్ సుజాత ఆధ్వర్యంలో బంద్ కు మద్దతు తెలుపుతూ బైక్ ర్యాలీ నిర్వహించారు. అనంతరం జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ కూడలిలో ధర్నా చేపట్టి నిరసన తెలిపారు. ఈ సందర్భంగా శ్రీకాంత్ రెడ్డి మాట్లాడుతూ..సీఎం రేవంత్ రెడ్డీ అగ్రకులానికి చెందినప్పటికీ ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు ముందుకు వెళుతున్నారని అన్నారు. బీసీ బిల్లు రిజర్వేషన్ ఆమోదం చెందితే ఎక్కడ కాంగ్రెస్ ప్రభుత్వ ఖాతాలో పడుతుందో అని, బీసీల జీవితాలను మార్చడానికి కాంగ్రెస్ చిత్తశుద్ధితో తీసుకుంటున్న నిర్ణయాలకు అడుగడుగునా బీజేపీ, బీఆర్ఎస్ లు అడ్డుపడుతున్నాయని అన్నారు. బీసీ రిజర్వేషన్ల విషయంలో వెనకడుగు వేసే ప్రసక్తే లేదని మునుముందు మరిన్ని ఆందోళనలు చేపట్టి బిల్లు ఆమోదం సాధించి తీరుతామని అన్నారు. కార్యక్రమంలో ఆదిలాబాద్ బీసీ సంఘాల నాయకులు, బీసీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షులు చిక్కాల దత్తు, ప్రధాన కార్యదర్శి కలాల శ్రీనివాస్, బండారి సతీష్ , కాంగ్రెస్ మండల నాయకులు, మావల మండల కాంగ్రెస్ అధ్యక్షులు ధర్మపురి చంద్రశేఖర్ మాజీ ఎంపీపీ ఆట్ల గోవర్ధన్ రెడ్డి, బీసీ నాయకులు సురేష్ కుమార్, రేండ్ల రాజన్న, గౌతమ్, టౌన్ వైస్ ప్రెసిడెంట్ అలీం, శము,రహీమ్, బషీర్, ఫహీం, రాజ్ మొహమద్, రహీమ్ ఖాన్, రావుల ప్రవీణ్, అఫ్సర్, అజీమ్, అఫ్సర్ ఖాన్, హలీమ్, రాజేశ్వర్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు.

