Chitram news
Newspaper Banner
Date of Publish : 18 October 2025, 3:51 pm Editor : Chitram news

ఘనంగా దండారి ఉత్సవాలు

ఘనంగా దండారి ఉత్సవాలు

చిత్రం న్యూస్, సొనాల: ఆదిలాబాద్ జిల్లా సొనాల మండలంలోని పార్డీ(కే) గ్రామంలో దండారి ఉత్సవాలు శనివారం ఘనంగా నిర్వహించారు. ప్రతి సంవత్సరం సంప్రదాయబద్ధంగా జరుపుకునే ఈ దండారి పండగకు గ్రామంలోని గుస్సాడి బృందo, అతిథులుగా వచ్చిన ఇతర గ్రామాల గుస్సాడీ బృందాలు, గ్రామ పెద్దలు, యువతీ, యువకులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. ఈ సందర్భంగా గ్రామ పెద్దలు మాట్లాడుతూ.. దండారి ఉత్సవాలు ఆదివాసీ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీక అని..పూజారులు మాత గంగమ్మ, మహాలక్ష్మీ, దేవతలకు ప్రత్యేక పూజలు చేసి గ్రామ ప్రజలంతా అష్టైశ్వర్యాలు సుఖశాంతులతో ఉండాలని కోరుకున్నారు. అనంతరం గ్రామస్తులు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. దండారి ఉత్సవాలు గ్రామ ఐక్యతను, ఆదివాసీ సంస్కృతిని ప్రతిబింబించే విశిష్ట వేడుకగా నిలిచాయి.