Chitram news
Newspaper Banner
Date of Publish : 18 October 2025, 10:33 am Editor : Chitram news

దేశాన్ని కదిలించేలా బీసీ బంద్ సంపూర్ణం

దేశాన్ని కదిలించేలా బీసీ బంద్ సంపూర్ణం

చిత్రం న్యూస్, బాసర: నిర్మల్ జిల్లా బైంసా బీసీ జేఏసీ తలపెట్టిన తెలంగాణ రాష్ట్ర బంద్ కు జనసేన పార్టీ సంపూర్ణ మద్దతు తెలిపింది. తెలంగాణ జనసేన పార్టీ నిర్మల్ జిల్లా నాయకులు సుంకేట మహేష్ బాబు  శనివారం బీసీల రాష్ట్ర బంద్ ను విజయవంతం చేసిన అన్ని పార్టీ ప్రజా సంఘాల నాయకులకు, ప్రజలకు, వాణిజ్య, వ్యాపార విద్యా సంస్థలకు ధన్యవాదములు  తెలిపారు. తెలంగాణ బీసీ జేఏసీ తలపెట్టిన రాష్ట్ర బంద్ కు బీసీ సంఘం రాష్ట్ర నాయకులు సుంకేట పోశెట్టి సంఘం తరపున సంపూర్ణ మద్దతు ప్రకటించారు.  భైంసా పట్టణం లోని అంబేద్కర్ విగ్రహం ముందర నిరసన తెలిపి మాట్లాడారు. బీసీ వాదాన్ని దేశాన్ని కదిలించేలా బంద్ ను విజయవంతం చేశారని వారు కొనియాడారు. బీసీల సత్తా ఏంటో చూపిస్థూ..బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల అమలుకు విడుదల చేసిన జీవో 9పై హైకోర్టులో స్టే ఇవ్వడాన్ని నిరసిస్తూ శనివారం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న బీసీ సంఘాల నాయకులు, అన్ని రాజకీయ పార్టీ లు భైంసాలో నిరసన వ్యక్తం చేశారు. బీసీ రిజర్వేషన్లపై హైకోర్టు స్టే విధించడంతో బీసీలకు తీరని అన్యాయం జరిగిందని ఆందోళన వ్యక్తం చేశారు. తెలంగాణ బీసీల ఆత్మగౌరవం, రాజకీయ రిజర్వేషన్స్ లలో వాటా కోసం ఐక్య పోరాటాలు చేయాలన్నారు. బీసీ ఉద్యమానికి ఒక స్వరూపం వచ్చే సమయం ఆసన్నమైందని, స్వార్థ ప్రయోజనాలు వద్దన్నారు. బీసీ రిజర్వేషన్లు పెంచిన ప్రతిసారీ రిజర్వేషన్ వ్యతిరేకులు కోర్టులను వేదికగా చేసుకుని అడ్డుకుంటున్నారని, కోర్టులు కూడా బీసీలకు న్యాయం చేయడం లేదని విమర్శించారు. నోటిఫికేషన్ ఉన్న నేపథ్యంలో ఎన్నికలను వాయిదా వేయొద్దని సుప్రీంకోర్టు ఆదేశాలున్నా, స్టే విధించి బీసీల హక్కులకు విఘాతం కలిగించారని మండి పడ్డారు. సుప్రీంకోర్టు ఆదేశాలకు విరుద్ధంగా రెండు వారాల పాటు కాంగ్రెస్ పార్టీ ఎన్నికలను వాయిదా వేయడం అన్యాయం అన్నారు. గత 75 ఏళ్లుగా బీసీల రాజ్యాధికారానికి ఆధిపత్య కులాలు, పాలక వర్గాలు అడ్డు పడటం దుర్మార్గం అన్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో బీసీలు ఐక్యమై ఒక శక్తిగా అవతరించడం ఎంతో ముఖ్యం అన్నారు. బీసీ రిజర్వేషన్స్ లపై హైకోర్ట్ స్టే బీసీలకు చీకటి రోజన్నారు. 42 శాతం రిజర్వేషన్స్ కల్పించిన తర్వాతే ఎన్నికలకు వెళ్ళాలన్నారు. అవసరమైతే ఢిల్లీలో పోరాటాలకు సిద్ధమని అన్నారు. ఈ బీసీ బంద్ కార్యక్రమంలో, బీజేపీ, బీఆర్ఎస్, కాంగ్రెస్, జనసేన పార్టీ ల నేతలు  పాల్గొన్నారు..