పేదింటి ఆడపడుచులకు అండగా కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్
చిత్రం న్యూస్, బాసర: నిర్మల్ జిల్లా బాసర మండలంలోని ఆయా గ్రామాల 36 మంది లబ్ధిదారులకు రైతు వేదికలో శుక్రవారం కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులను ముథోల్ ఎమ్మెల్యే పవార్ రామారావు పటేల్ అందజేశారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ..కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ పథకాలు నేడు నిరుపేదలకు వరంగా మారాయని అన్నారు. అర్హులైన ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు అందజేస్తామని తెలిపారు. దళారుల ప్రమేయం లేకుండా నేరుగా లబ్ధిదారులకు ఈ చెక్కులను పంపిణీ చేస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో బాసర మండల తహసీల్దార్ పవన్ చంద్ర, బైంసా వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ సిందే ఆనందరావు పటేల్, బీజేపీ మండల అధ్యక్షులు, మాజీ సర్పంచులు ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
