రహదారి సమస్య పరిష్కారం తీరేనా!
చిత్రం న్యూస్, జైనథ్: మహరాష్ట్ర సరిహద్దు నుంచి అదిలాబాద్ జిల్లా జైనథ్ మండలం కూర గ్రామం మీదుగా కాఫ్రి వరకు R&B ద్వార రహదారి నిర్మించారు. రోడ్డు ట్రాఫిక్ అసౌకర్యానికి, ప్రమాదాలకు సంబంధించి కూర గ్రామస్తులు ప్రజవాణి ఫిర్యాదులో దాదాపుగా సంవత్సరం క్రితం వినతి పత్రం అందించారు. గ్రామం మీద నుంచి వెళ్లే వాహనాలు వేగంగా వెళ్లడంతో తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయని, R&B అధికారుల రోడ్లపై స్పీడ్ బ్రేకర్లు అనుమతించబడనప్పటికీ, సమస్యను పరిష్కరించడానికి తగిన రంబుల్ స్ట్రిప్‌లను ఏర్పాటు చేయాలని పేర్కొన్నారు. జిల్లా కలెక్టర్ రాజర్షి షా గ్రీవెన్స్ లో R&B అధికారులకు సమస్యను పరిష్కరించాలని ఆదేశించారు. సంవత్సరం గడుస్తున్నా అధికారులు పట్టించుకోకపోవడంతో సమస్య పరిష్కారం కాక ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.


