Chitram news
Newspaper Banner
Date of Publish : 16 October 2025, 5:20 pm Editor : Chitram news

విధుల్లో చేర్చుకోండి..లడ్డు ప్యాకేజ్ దినసరి కూలీలు 

విధుల్లో చేర్చుకోండి..లడ్డు ప్యాకేజ్ దినసరి కూలీలు 

చిత్రం న్యూస్, బాసర: నిర్మల్ జిల్లా బాసర శ్రీ జ్ఞాన సరస్వతి అమ్మవారి ఆలయంలో లడ్డు తయారీ కేంద్రంలో లడ్డు ప్యాకేజ్ గా విధులు నిర్వహించిన సుమారు పదిమంది రోజువారి దినసరి కూలీలకు ఉద్యోగ భద్రత లేక వీధిన పడ్డారు. గత 20 సంవత్సరాల నుండి ఆలయంలో విధులు నిర్వహిస్తున్నాం . ఈ సంవత్సరం జనవరి 28వ తేదీన దేవస్థానం అధికారులు వీరిని విధుల నుంచి  తొలగించడంతో సిబ్బంది ఆందోళన చెందుతున్నారు. తిరిగి విధుల్లో చేర్చుకోవాలని లడ్డు ప్యాకేజ్ దినసరి కూలీలు పలుమార్లు ఆలయానికి వచ్చిన మంత్రులు, ఎమ్మెల్యేలు,కలెక్టర్ తో పాటు హైదరాబాదులోని దేవదాయ శాఖ కమిషనర్ కు కలసి తమ సమస్యలను పరిష్కరించాలని వినతిపత్రం ఇచ్చామన్నారు. ఇప్పటివరకు సమస్య పరిష్కారం కాలేదని తమను పట్టించుకునే నాథుడు కరువయ్యారని ఆరోపిస్తున్నారు. తిరిగి తమను విధుల్లోకి తీసుకోవాలని దినసరి కూలీలు దేవస్థానం కార్యనిర్వణాధికారి అంజనాదేవిని  కోరుతున్నారు.