Chitram news
Newspaper Banner
Date of Publish : 15 October 2025, 10:40 am Editor : Chitram news

MLA PAYAL SHANKAR: పెరుగుతున్న సాంకేతికతను అందిపుచ్చుకోవాలి

MLA PAYAL SHANKAR: పెరుగుతున్న సాంకేతికతను అందిపుచ్చుకోవాలి

చిత్రం న్యూస్: జైనథ్: మారుతున్న కాలంతో పాటు పెరుగుతున్న సాంకేతికతను అందిపుచ్చుకుంటూ  ముందుకు సాగాలని ఎమ్మెల్యే  పాయల్ శంకర్ అన్నారు. జైనథ్ మండలంలోని  అడ జడ్పీ ఉన్నత  పాఠశాలలో ఆశా ఫర్ ఎడ్యుకేషన్ సహకారంతో ఏకలవ్య ఫౌండేషన్ ఆధ్వర్యంలో 1.80 లక్షలు విలువగల స్మార్ట్ కంప్యూటర్ ల్యాబ్ ను బుధవారం ఎమ్మెల్యే ముఖ్యఅతిథిగా హాజరై ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే పాయల్ శంకర్   మాట్లాడుతూ.. ప్రస్తుతం స్మార్ట్ యుగం కొనసాగుతుందని దానికి అనుగుణంగా విద్యార్థులు కంప్యూటర్ శిక్షణలు తీసుకోవాలన్నారు. వారికి ఉపయోగపడేలా ఏకలవ్య ఫౌండేషన్ ఆధ్వర్యంలో స్మార్ట్ కంప్యూటర్ ల్యాబ్ ఏర్పాటు చేయడం అభినందనీయమన్నారు. పుస్తకాలంలో ప్రతి పోటీ పరీక్ష ఆన్లైన్లోనే కొనసాగుతుందన్నారు. అదే దిశగా విద్యార్థులు ఇప్పటినుంచే ఎదగాలన్నారు. పాఠశాలలో ఏర్పాటుచేసిన స్మార్ట్ ల్యాబ్ ను సద్వినియోగం చేసుకోవాలన్నారు. అదేవిధంగా పాఠశాలలో మౌలిక వసతులు కల్పనకు తన వంతు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ఎంఈఓ శ్రీనివాస్, పాఠశాల హెచ్ఎం గుణవంత్, ఏకలవ్య ఫౌండేషన్ కోశాధికారి సతీష్ దేశ్పాండే, ప్రోగ్రాం మేనేజర్ ప్రశాంత్, ట్రస్టీలు దిగంబర్, రామ్ రెడ్డి, బీజేపీ నాయకులు లాలా మున్నా, కోరెడ్డి వెంకటేష్, గ్రామస్తులు పాల్గొన్నారు.