ఓని గ్రామంలో అంత్యక్రియల్లో పాల్గొన్న భైంసా మార్కెట్ కమిటీ చైర్మన్ సిందే ఆనందరావ్ పటేల్
చిత్రం న్యూస్, బాసర: నిర్మల్ జిల్లా బాసర మండలంలోని ఓని గ్రామంలో నిర్వహించిన మాజీ సర్పంచ్ ఆనందరావు పటేల్ తల్లి నాగబాయ్ అంత్యక్రియల్లో భైంసా వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ సిందే ఆనందరావ్ పటేల్ పాల్గొన్నారు. గ్రామానికి చేరుకున్న ఆయన మృతుని ఇంటికి వెళ్లి కుటుంబ సభ్యులను పరామర్శించి వారికి ధైర్యం చెప్పారు. కుటుంబ సభ్యుల బాధలో భాగస్వామ్యం అవుతూ, ఆపదలో ధైర్యంగా నిలబడాలని సూచించారు. మృతుని ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, వివిధ రాజకీయ పార్టీ నాయకులు, గ్రామ పెద్దలు, యువకులు, మహిళలు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు.

