సోయా కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలని రైతుల పాదయాత్ర
భారతీయ కిసాన్ సంఘ్ ఆధ్వర్యంలో బాసర అమ్మవారికి రైతుల పూజలు
చిత్రం న్యూస్, బాసర:ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయలేదని నిరసిస్తూ భారతీయ కిసాన్ సంఘ్ (BKS) ఆధ్వర్యంలో బాసర, ముథోల్, తానూర్, బైంసా మండలాల రైతులు ప్రభుత్వ తీరుకు నిరసనగా ర్యాలీ చేపట్టారు. వరదలతో నష్టపోయిన రైతులను ప్రభుత్వం ఆదుకోవాలని, సోయా పంట చేతికి వచ్చిందని, సరైన మద్దతు ధర ఇవ్వకుండా ప్రతి పంటకు రైతులు ఇబ్బందులు పడుతున్నారన్నారు. ఇప్పటివరకు కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయలేదని, రైతులను ప్రభుత్వం పట్టించుకోవటం లేదని, అధికారులకు ఎన్ని వినతి పత్రాలు ఇచ్చినా చలనం లేదని మండిపడ్డారు. మంగళ వారం ముథోల్ లోని పశుపతినాత్ శివాలయంలో బసచేసి బుధవారం ఉదయం భైంసా సబ్ కలెక్టర్ కార్యాలయం ముందు నిరసన తెలుపనున్నారు.ప్రభుత్వం స్పందించకపోతే రైతులందరినీ ఏకం చేసి రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర నిరసనను చేపడతామని భారతీయ కిసాన్ సంఘ్ నాయకులు హెచ్చరించారు. అంతకుముందు నిర్మల్ జిల్లా బాసర అమ్మవారి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు.

