ఆర్జేయూకేటీలో రోడ్డు భద్రతపై అవగాహన కార్యక్రమం
చిత్రం న్యూస్, బాసర: నిర్మల్ జిల్లా ఆర్జేయూకేటీ బాసర, సర్వేజనా ఫౌండేషన్ హైదరాబాద్ వారి సంయుక్త ఆధ్వర్యంలో సివిల్ ఇంజనీరింగ్ విభాగం వారు ‘ రోడ్డు భద్రత – పౌరుల విధి’ అనే కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా అధ్యాపకురాలు శాంతి జగదీశ్వరి మాట్లాడుతూ..జీవితం ఎంతో విలువైందని, డ్రైవింగ్ లైసెన్స్ ఉన్న వాహనదారులు మాత్రమే వాహనాలు నడపాలన్నారు. ద్విచక్ర వాహనదారులు విధిగా హెల్మెట్లు ధరించాలని, కార్లు నడిపే వాళ్ళు తప్పకుండా సీట్ బెల్ట్ పెట్టుకోవాలని, వాహనాలు నడిపే సమయంలో బండికి సంబంధించిన అన్ని పత్రాలు తమ దగ్గర ఉంచుకోవాలని, మద్యం తాగి ఎట్టి పరిస్థితుల్లో వాహనాలను నడపరాదని తెలిపారు. ట్రిపుల్ డ్రైవింగ్ చేయొద్దని, మైనర్లకు వాహనాలు ఇవ్వద్దని, వాహనదారులు ట్రాఫిక్ నిబంధనలు సరిగా పాటిస్తే వారి కుటుంబానికి వారు ఆసరాగా ఉండొచ్చని వారి జీవితాలకు ఒక భరోసా ఉంటుందని అన్నారు. విద్యార్థుల చేత రోడ్డు భద్రతను పాటిస్తామని ప్రతిజ్ఞ చేయించారు. ఈ కార్యక్రమంలో సివిల్ ఇంజనీరింగ్ అధ్యాపకులు, ఇంజనీరింగ్ మూడో సంవత్సరం విద్యార్థులు, ల్యాబ్ స్టాఫ్ బలరాం తదితరులు పాల్గొన్నారు.
-Advertisement-

