ప్రతి ఒక్కరూ ఆధ్యాత్మిక మార్గంలో నడవాలి
బైరందేవ్ విగ్రహ ప్రతిష్ఠాపనలో మాజీ మంత్రి జోగు రామన్న
చిత్రం న్యూస్ బేల: ప్రతి ఒక్కరూ ఆధ్యాత్మిక మార్గంలో నడవాలని మాజీ మంత్రి జోగు రామన్న అన్నారు. ఆదివారం మండలంలోని సదల్పూర్ గ్రామ శివారులో గల నూతన బైరందేవ్ విగ్రహ ప్రతిష్ఠాపన కార్యక్రమంలో ముఖ్య అతిథిగా మండల బీఆర్ఎస్ నాయకులతో పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మాజీ సీఎం కేసీఆర్ ప్రభుత్వం సదల్పూర్ లో ఉన్నటువంటి బైరందేవ్, మహాదేవ్ దేవాలయ ఆవరణలో రూ. 2 కోట్లతో అభివృద్ధి చేశామన్నారు. ప్రస్తుతం ప్రతి గ్రామంలో ఎక్కడి సమస్యలు అక్కడే ఉన్నాయని పేర్కొన్నారు. ఆదివాసులు, బడుగు బలహీన వర్గాల కోసం ఎంతో పాటు పాడిన ప్రభుత్వం కేసీఆర్ ప్రభుత్వం అని అన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ గ్రంథాలయ చైర్మన్ రౌత్ మనోహర్, బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షలు ప్రమోద్ రెడ్డి, సీనియర్ నాయకులు మస్కే తేజ్రావు , అడానేశ్వర్ ఫౌండేషన్ చైర్మన్ బీఆర్ఎస్ పార్టీ యువ నాయకుడు సతీష్ పవార్, మాజీ సర్పంచులు విపిన్ ఖోడే, విట్టల్ వరాడే, మాజీ ఎంపీటీసీ అరుణ్ కొడప, ముఖ్యనాయకులు విట్టల్ రౌత్ ,బత్తుల సుదర్శన్, మహదవ్ రాథోడ్ తదితరులు పాల్గొన్నారు.
