శబరిమలకు అయ్యప్ప స్వాముల పాదయాత్ర
సునీల్ గురుస్వామి ఆధ్వర్యంలో బయలుదేరిన అయ్యప్ప భక్తులు
చిత్రం న్యూస్, బాసర: నిర్మల్ జిల్లా ముథోల్ మండల కేంద్రంలోని బ్రాహ్మణగావ్ గ్రామంతో పాటు ఆయా గ్రామాల నుండి అయ్యప్ప దీక్షాపరులు ఆదివారం బ్రాహ్మణగావ్ హనుమాన్ ఆలయంలో పూజలు నిర్వహించి శబరిమల అయ్యప్ప సన్నిధానానికి పాదయాత్రగా బయలుదేరారు. సుమారు 20 మంది స్వాములు 45 రోజులు పాదయాత్ర చేసి స్వామివారి సన్నిధానం చేరుకుంటారని తెలిపారు. ముథోల్ మండలం అష్ట గ్రామానికి చెందిన సునీల్ గురుస్వామి ఆధ్వర్యంలో లోక కళ్యాణం కోసం మహా పాదయాత్ర చేపట్టినట్లు ఆయన తెలిపారు. స్వాములు స్వామియే శరణమయ్యప్ప అంటూ శరణుఘోషతో బయలుదేరారు.

