ADILABAD MLA PAYAL SHANKAR: రాజకీయాల కతీతంగా పేదలకు ప్రభుత్వ ఫలాలు
* లబ్ధిదారులతో కలిసి ఇందిరమ్మ ఇళ్లకు భూమిపూజ చేసిన ఎమ్మెల్యే పాయల్ శంకర్
చిత్రం న్యూస్, జైనథ్: రాజకీయాలకతీతంగా పేదలకు ప్రభుత్వ ఫలాలు అందించడమే లక్ష్యంగా పనిచేస్తున్నామని ఆదిలాబాద్ ఎమ్మెల్యే పాయల్ శంకర్ అన్నారు. నిరుపేదల సొంతింటి కలలు సహకారం చేసేలా చేపడుతున్న ఇండ్ల నిర్మాణం కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా శనివారం భోరజ్ మండలంలోని పూసాయి, మాండగడ గ్రామాలలో ఇందిరమ్మ, ప్రధాన మంత్రి ఆవాస్ యోజన పథకం కింద మంజూరైన ఇండ్లకు స్థానిక నాయకులు, లబ్ధిదారులతో కలిసి ఎమ్మెల్యే భూమి పూజ చేశారు. ఈ మేరకు ఎమ్మెల్యే పాయల్ శంకర్ మాట్లాడుతూ.. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలో ఇండ్లు లేని నిరుపేదలు ఎవ్వరు ఉండకూడదని సదుద్దేశంతో ఇప్పటికే 4 కోట్ల 80 లక్షల ఇంటి నిర్మాణాలు చేపట్టడం జరిగిందని, ఈ సంవత్సరం మరో 2 కోట్ల 40 లక్షల ఇండ్ల నిర్మాణ కార్యక్రమం జరుగుతోందన్నారు. పేదల సొంతింటి కలను సహకారం చేసేలా భూమి పూజ చేసిన ఇండ్లకు అధికారులు త్వరితగతిన నిర్మాణాలు పూర్తి చేయాలని సూచించారు. కార్యక్రమంలో బీజేపీ నాయకులు, అశోక్ రెడ్డి, రమేష్, గంగాధర్ సంజు,గణేష్, శ్రీనివాస్, అధికారులు, లబ్ధిదారులు పాల్గొన్నారు.
