ఘనంగా ముగిసిన అఖండ హరినామ సప్తాహ
ఘనంగా ముగిసిన అఖండ హరినామ సప్తాహ చిత్రం న్యూస్, బాసర: నిర్మల్ జిల్లా బాసరలోని మహారాష్ట్ర పర్డేకర్ భవనంలో వారం రోజుల అఖండ హరినామ సప్తాహ శనివారం రోజు ఘనంగా ముగిసింది. బ్రహ్మముహుర్తాన స్వామి వారికి కాగడ హారతితో పాటు భక్తులు ప్రత్యేక పూజలు చేశారు. పర్భని జిల్లాకు చెందిన యోగేష్ మహారాజ్ భక్తులను ఉద్దేశించి ప్రవచనాలు చేశారు. ఆధ్యాత్మిక చింతనతోనే మానసిక ప్రశాంతత ఉంటుందని పేర్కొన్నారు. దైవ నామస్మరణ చేస్తే భగవంతునికి ప్రీతి పాత్రులవుతారన్నారు. గ్రామంలోని ప్రతి...