Chitram news
Newspaper Banner
Date of Publish : 11 October 2025, 12:41 pm Editor : Chitram news

ఘనంగా ముగిసిన అఖండ హరినామ సప్తాహ

ఘనంగా ముగిసిన అఖండ హరినామ సప్తాహ

చిత్రం న్యూస్, బాసర: నిర్మల్ జిల్లా బాసరలోని మహారాష్ట్ర పర్డేకర్ భవనంలో వారం రోజుల అఖండ హరినామ సప్తాహ శనివారం రోజు ఘనంగా ముగిసింది. బ్రహ్మముహుర్తాన స్వామి వారికి కాగడ హారతితో పాటు భక్తులు ప్రత్యేక పూజలు చేశారు. పర్భని జిల్లాకు చెందిన యోగేష్‌ మహారాజ్‌ భక్తులను ఉద్దేశించి ప్రవచనాలు చేశారు. ఆధ్యాత్మిక చింతనతోనే మానసిక ప్రశాంతత ఉంటుందని పేర్కొన్నారు. దైవ నామస్మరణ చేస్తే భగవంతునికి ప్రీతి పాత్రులవుతారన్నారు. గ్రామంలోని ప్రతి ఒక్కరు భక్తి సన్మార్గంలో నడవాలని సూచించారు. ప్రతి సంవత్సరం బాసరలో అఖండహరినామ సప్తాహ నిర్వహించడంతో ప్రతి ఒక్కరిలో ఆధ్యాత్మిక భావనలతో పాటు క్రమశిక్షణ, జీవన విధానంలో మార్పు వచ్చి, వ్యవసనాలకు, దురలవాట్లకు దూరంగా ఉండటానికి ఎంతగానో ఉపయోగ పడుతుందన్నారు.