వైన్స్ షాపుల్లో దొంగతనం చేసిన నిందితుల అరెస్టు
చిత్రం న్యూస్, బాసర: నిర్మల్ జిల్లా లోని ముథోల్, తానూర్ మండల కేంద్రాల్లో జరిగిన వైన్స్ షాపుల దొంగతనాల కేసును పోలీసులు చాకచక్యంగా చేధించారు. భైంసా ASP అవినాష్ కుమార్ నిందితుల వివరాలను శనివారం వెల్లడించారు. నిజామాబాద్ జిల్లా రెంజల్ మండలం తాడ్ బిలోలికి చెందిన యాపరి వినోద్ తన స్నేహితులైన బ్యాగరి రోహిత్, నీరది శ్రావణ్ కుమార్, ఖదులూరి సాయి ఆదిత్య గౌడ్, పట్ల నవీన్, టి.దిలీప్ లతో కలిసి దొంగతనానికి పాల్పడ్డారన్నారు. మే నెల 24న శ్రావణ్ కుమార్ పుట్టిన రోజు సందర్భంగా ముథోల్ లోని రాజరాజేశ్వర వైన్స్ లో మద్యం బాటిళ్ల కాటన్లను అపహరించారన్నారు. జనవరి 24న తానూర్ లోని లక్ష్మీ వైన్స్ లో రూ.8 వేల నగదును దొంగలించారని, సీసీ కెమెరాల్లో దొంగతనం చేస్తున్న దృశ్యాలు కనిపిస్తాయని గమనించి వాటిని సైతం దొంగలించి బాసర గోదారి నదిలో పడేశారన్ననారు.వినోద్ తాడ్ బిలోలి లో బెల్టు షాపు నడుపుతూ ఇక్కడ చోరీ చేసిన మద్యం బాటిళ్లను అక్కడ విక్రయించగా వచ్చిన డబ్బులను అతని వద్దే ఉంచుకున్నాడన్నాడు. మరో దొంగతనం చేసినప్పుడు వాటా ఇస్తా అని చెప్పాడన్నాడు. శుక్రవారం ముథోల్ ఆర్టీసీ బస్ స్టాండ్ వద్ద దొంగతనం చేసే ఉద్దేశంతో తిరుగుతుండడంతో పోలీసులు నిందితులను పట్టుకున్నారన్నారు. ప్రధాన నిందితుడు యాపరి వినోద్ తో పాటు మరో ముగ్గురిని పట్టుకొని అరెస్టు చేసి రిమాండ్ కు తరలిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. ముథోల్ సీఐ మల్లేష్ ఎస్సై బిట్ల పెర్సిస్, తానూర్ ఎస్సై జుబేర్ లను జిల్లా SP డాక్టర్ జానకి షర్మిల అభినందించారు.
