Chitram news
Newspaper Banner
Date of Publish : 11 October 2025, 11:05 am Editor : Chitram news

ద్విచక్రవాహనం చోరీ చేసిన దొంగల అరెస్టు

ద్విచక్రవాహనం చోరీ చేసిన దొంగల అరెస్టు

చిత్రం న్యూస్, బాసర: నిర్మల్ జిల్లా బాసర మండలం శారద నగర్ కాలనీకి చెందిన పలారం గంగాధర్ ద్విచక్రవాహనం దొంగలించిన ఇద్దరు దొంగలను బాసర పోలీసులు పట్టుకున్నారు. స్థానికుల కథనం ప్రకారం..గంగాధర్ ఎప్పటిలాగే ఇంటి వద్ద ద్విచక్రవాహనాన్ని పార్కింగ్ చేశారు.  ఇంతలో గుర్తుతెలియని ఇద్దరు దొంగలు ఇంటి లోపలికి చొరబడి పార్కింగ్ చేసిన బైకును ఎత్తుకొని పారిపోయారు. బాధితుడు బాసర పోలీసులను ఆశ్రయించాడు. రంగంలోకి దిగిన  పోలీసులు నిందితులను పట్టుకొని వారి వద్ద ఉన్న ద్విచక్రవాహనాన్ని స్వాధీనం చేసుకుని పలారం గంగాధర్ కు అప్పగించారు. చాకచక్యంగా వ్యవహరించి దొంగలను పట్టుకున్న పోలీసులకు కాలనీవాసుల నుంచి అభినందనలు వెల్లువెత్తుతున్నాయి.