సోయా కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేయాలని తహసీల్దార్ కి వినతి పత్రం అందజేత
చిత్రం న్యూస్, బాసర: నిర్మల్ జిల్లా బాసర మండల కేంద్రంలో సోయా కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేయాలని భారతీయ కిసాన్ సంఘ్ ఆధ్వర్యంలో బాసర మండల తహసీల్దార్ పవన్ చంద్రకు శుక్రవారం వినతి పత్రం అందజేశారు. ఈ మేరకు తహసీల్దార్ కార్యాలయంలో ఆయనను కలిసి మాట్లాడారు. ఈ కార్యక్రమంలో బాసర మండల కార్యదర్శి ఆనంద్ బండారి, బాసర మాజీ సర్పంచ్ సతీష్ రావ్, ముత్యం భగవాన్, బలిరాం, రైతులు, తదితరులు పాల్గొన్నారు.
