బీఆర్ఎస్ పార్టీలో చేరిన జిల్లా మహిళా సమైక్య మాజీ అధ్యక్షురాలు వనజ
గులాబీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించిన ఎమ్మెల్యే అనిల్ జాదవ్
చిత్రం న్యూస్, నేరడిగొండ : ఆదిలాబాద్ జిల్లా నేరడిగొండ మండల కేంద్రానికి చెందిన జిల్లా మహిళ సమైక్య మాజీ అధ్యక్షురాలు ముదుల్కర్ వనజ ఆమె అనుచరులతో కలిసి గురువారం బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ సమక్షంలో బీఆర్ఎస్ పార్టీలో చేరారు. వీరికి ఎమ్మెల్యే అనిల్ జాదవ్ గులాబీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా జిల్లా మహిళ సమైక్య మాజీ అధ్యక్షురాలు వనజ మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం మహిళలను మోసం చేసిందని, మహిళలకు నెలకు రూ.2500 ఇస్తానని చెప్పి నమ్మించి మోసం చేసిందన్నారు. ఉచిత బస్సు పేరిట గొడవలు పెట్టిందని మండిపడ్డారు. రానున్న స్థానిక ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి బుద్దిచెబుతామన్నారు. మహిళలు అభివృద్ధి చెందాలంటే బీఆర్ఎస్ పార్టీతోనే సాధ్యమని, ఎప్పుడూ సంప్రదించిన అండగా నిలబడే ఎమ్మెల్యే అనిల్ జాదవ్ పక్షంలో ఉండాలని, బీఆర్ఎస్ లో చేరడం జరిగిందన్నారు. ఎమ్మెల్యే అనిల్ జాదవ్ మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం మహిళలకు చేసిన మోసాలకు మహిళలు మండిపడుతున్నారని, వారికి కచ్చితంగా మహిళలే బుద్దిచెబుతారని, ఆడ బిడ్డలను మోసం చేస్తే ఎవరు బాగుపడరని అన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ రాథోడ్ సజన్, రవీందర్ రెడ్డి, పండరీ, దేవేందర్ రెడ్డి, ప్రతాప్ తదితరులు ఉన్నారు.
