రెడ్డి ఐక్యవేదిక రాష్ట్ర సహాయ కార్యదర్శిగా ఎల్మ సంజయ్ రెడ్డి
చిత్రం న్యూస్, ఆదిలాబాద్: రెడ్డి ఐక్యవేదిక రాష్ట్ర సహాయ కార్యదర్శిగా ఆదిలాబాద్ జిల్లా తలమడుగు మండలం ఖోడద్ గ్రామానికి చెందిన ఎల్మ సంజయ్ రెడ్డి నియమితులయ్యారు. ఈ మేరకు ఆ సంఘం రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు ఏనుగు సంతోష్ రెడ్డి, తిరుపతిరెడ్డి చేతుల మీదుగా నియామక పత్రం అందుకున్నారు. ఈ సందర్భంగా సంజయ్ రెడ్డి(అడ్వకేట్) మాట్లాడుతూ.. పేద రెడ్డి బంధువులకు న్యాయం చేస్తానని, రెడ్ల వైభవానికి, అభ్యున్నతికి కృషి చేస్తానని తెలిపారు. ఈ కార్యక్రమంలో వర్కింగ్ ప్రెసిడెంట్ నల్లవెల్లి కరుణాకర్ రెడ్డి, యూత్ జనరల్ సెక్రెటరీ క్యాతం శివప్రసాద్ రెడ్డి, ఇతర రెడ్డి బంధువులు పాల్గొన్నారు.
<img class="aligncenter wp-image-5557 size-full"src=https://chitramnews.com/wp-content/uploads/2026/03/3958e92009bc40ddb4a9035dd59af409-3.jpg alt="" width="914" height="733" /


