Chitram news
Newspaper Banner
Date of Publish : 08 October 2025, 7:08 am Editor : Chitram news

పనికిరాని వస్తువులతో ఎలక్ట్రికల్ బ్లూటూత్ స్పీకర్ తయారు 

పనికిరాని వస్తువులతో ఎలక్ట్రికల్ బ్లూటూత్ స్పీకర్ తయారు 

చిత్రం న్యూస్, బాసర: నిర్మల్ జిల్లా బాసర మండలం కౌఠ గ్రామంలోనీ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో  7వ తరగతి చదివే విద్యార్థి శోభన్కర్ ఆదిత్య  తన  అద్భుతమైన తెలివిని ఉపయోగించి పనికి రాని వస్తువులతో ఎలక్ట్రికల్ బ్లూటూత్ స్పీకర్ ను తయారు చేసి చూపించాడు. అటు చదువుతోపాటు ఆ విద్యార్థి ప్రతిభను గుర్తించిన పాఠశాల ప్రధానోపాధ్యాయుడు రాజయ్య, ఉపాధ్యాయ బృందం ప్రోత్సహించారు. దీంతో ఆ విద్యార్థి పనికిరాని వస్తువులని ఉపయోగించి బ్లూటూత్ స్పీకర్ తయారుచేసి అందరినీ అబ్బురపరచాడు. ప్రతి ఒక్కరూ విద్యార్థిని ఆదర్శంగా తీసుకోవాలన్నారు. నేటి సమాజంలో అన్ని రంగాలు  టెక్నాలజీతో ముడిపడిందని ప్రతి ఒక్కరు తమ ప్రతిభతో, ఆలోచనతో పనికిరాని  వస్తువులను సేకరించి వివిధ రకాల వస్తువులను తయారు చేసి తమ ప్రతిభను ప్రదర్శించాలన్నారు. గతంలో కూడా బాసర శ్రీ జ్ఞాన సరస్వతి అమ్మవారి ఆలయంలో (ఎన్ ఎమ్ ఆర్) వాగ్దేవి సొసైటీ సిబ్బంది గా విధులు నిర్వహిస్తున్న ప్రకాష్ పనికిరాని వస్తువులతో ఇంటికి ఉపయోగపడే వంద రకాల అలంకార వస్తువులను తయారు చేసి వావ్ అనిపించుకున్నాడు.