Chitram news
Newspaper Banner
Date of Publish : 07 October 2025, 1:16 pm Editor : Chitram news

కుమురం భీం  పోరాట పటిమ ఎన్నటికీ మరువలేనిది

కుమురం భీం  పోరాట పటిమ ఎన్నటికీ మరువలేనిది 

కుమురం భీం విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పిస్తున్న బోరంచు శ్రీకాంత్ రెడ్డి.

చిత్రం న్యూస్, ఆదిలాబాద్: జల్, జంగల్, జమీన్ నినాదంతో అడవి బిడ్డల హక్కులకోసం పోరాడిన కుమురం భీం  పోరాట పటిమ ఎన్నటికీ మరువలేనిదని, వారి ఆశయ సాధనకోసం తెలంగాణ ప్రజా ప్రభుత్వం పనిచేస్తోందని తెలంగాణ కిసాన్ కాంగ్రెస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బోరంచు శ్రీకాంత్ రెడ్డి అన్నారు. ఆదివాసీ ఆత్మగౌరవ ప్రతీక కుమురం భీం వర్ధంతిని పురస్కరించుకుని ఆదిలాబాద్ జిల్లాకేంద్రంలోని కుమురం భీం చౌక్ లోని అయన విగ్రహానికి కాంగ్రెస్ నేతలతో కలిసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా భీం విగ్రహానికి పూలమాలలు వేసి ఆయన చేసిన సేవలను గుర్తుచేసుకున్నారు. ఈ సందర్భంగా శ్రీకాంత్ రెడ్డి మాట్లాడుతూ.. స్వపరిపాలన కోసం,ఆదివాసీ హక్కులకోసం ఆనాటి పాలకులకు వ్యతిరేకంగా పోరాడిన ఒక గొప్ప వీరుడు కుమురం భీం అని గుర్తుచేశారు. తెలంగాణ విముక్తి కోసం నిజాంకు వ్యతిరేకంగా పోరాడి గిరిజనుల హక్కుల సాధనకోసం కృషిచేసిన భీం పోరాట స్ఫూర్తి నేటికీ ఆదర్శమన్నారు. తెలంగాణ ప్రభుత్వం గిరిజన అభ్యున్నతికి ప్రత్యేక కృషిచేస్తోందని తెలిపారు. కార్యక్రమంలో మావల మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ధర్మపురి చంద్రశేఖర్, ఆదివాసీ జిల్లా చైర్మన్ సెడ్మకి ఆనందరావు, NSUI మావల మండల అధ్యక్షుడు మర్సుకోల గౌతం, మావల మండల వర్కింగ్ ప్రెసిడెంట్ కుదురుపాక సురేష్, మాజీ కో ఆప్షన్ మెంబర్ రహీమ్ ఖాన్, సీనియర్ నాయకులు రేండ్ల రాజన్న, కొరటి ప్రభాకర్, అలీమ్ ఖాన్, సముల ఖాన్, ఫెరోజ్ ఖాన్, MD వసీం, అఫ్సర్ ఖాన్ తదితరులు పాల్గొన్నారు..