కుమురం భీం పోరాట స్ఫూర్తి అందరిలో రావాలి
*నిజాం పాలనలోనే జల్, జంగల్, జమీన్ కోసం పోరాడిన మన జిల్లా బిడ్డ కుమురం భీం
చిత్రం న్యూస్,నేరడిగొండ: కుమురం భీం జ్ఞాపకార్తం రూ. 25 కోట్లతో జోడేఘాట్ లో మ్యూజియం ఏర్పాటు చేసిన ఘనత మాజీ సీఎం కేసీఆర్ దని బోథ్ ఎలా అనిల్ జాదవ్ అన్నారు. జల్, జంగల్, జమీన్ కోసం పోరాడుతూ ప్రాణాలు వదిలిన ఆదివాసీ ఆరాధ్య దైవం కుమురం భీం 85వ వర్ధంతి సందర్భంగా నేరడిగొండ మండలంలో బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.మావ నాటే..మావ రాజ్ కలను సాకారం చేసి వారి గ్రామాల్లో వారికే అధికారం ఇచ్చిన ఘనత కేసీఆర్ దని అన్నారు. ఈ కార్యక్రమంలో ఆయా మండలాల నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

