మందు గుండు సామగ్రి తయారీ కేంద్రాల తనిఖీ
చిత్రం న్యూస్, పెద్దాపురం: కాకినాడ జిల్లా పెద్దాపురం పట్టణ పరిధిలో గల దీపావళి మందు గుండు సామగ్రి తయారీ కేంద్రాలను అధికారులు మంగళవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. పోలీసు రెవెన్యూ, అగ్ని మాపక అధికారులు, తూనికలు, కొలతల శాఖ అధికారులు సంయుక్తంగా ఈ తనిఖీలో పాల్గొన్నారు. ప్రభుత్వ నిబంధన లకు అనుగుణంగా మాత్రమే మందు గుండు సామగ్రి తయారీ చేయాలని అధికారులు హుకుం జారీ చేశారు. కార్యక్రమంలో సీఐ విజయ శంకర్, తహసీల్దార్ సిహెచ్ వెంకటలక్ష్మి, ఎస్సై మౌనిక, పెద్దాపురం అగ్నిమాపక అధికారి జగన్నాథం తదితరులు పాల్గొన్నారు.

