Chitram news
Newspaper Banner
Date of Publish : 05 October 2025, 11:57 am Editor : Chitram news

అకాల వర్షంతో రైతన్నలకు కష్టాలు 

అకాల వర్షంతో రైతన్నలకు కష్టాలు 

సోయా పంట కాపాడేందుకు ఇబ్బందులు

చిత్రం న్యూస్, బాసర: నిర్మల్ జిల్లా బాసర మండలంలోని ఆయా గ్రామాల్లో ఆదివారం  వర్షం కురిసింది. ఆరుగాలం కష్టపడి పండించిన పంట చేతికి వచ్చే సమయంలోనే భారీ వర్షం కురవడంతో రైతన్నలు తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. సోయా పంట వచ్చిందని ఆరబోయే సమయానికి అకాల వర్షం కురవడంతో రైతన్నలకు ఏం చేయాలో అర్థం కావడం లేదు. వర్షాలు రైతుల కంటిమీద కునుకులేకుండా చేస్తున్నాయి. మొన్నటి వరకు భారీ వర్షాలతో పంటలు దెబ్బతినగా.. ఇప్పుడేమో చేతికి అందిన సోయా పంట ఆరబోయనీయకుండా వరుణుడు ప్రతాపం చూపిస్తున్నాడు.  ఎప్పుడొస్తుందో తెలియని వర్షం నుంచి పంటలను కాపాడుకునేందుకు రైతులు కల్లాల వద్దే పడిగాపులు కాస్తున్నారు. పంట కుప్పలపై టార్ఫాలిన్లు కప్పుతూ పంటను కాపాడుకునేందుకుకు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు.