కనుల విందుగా షష్టిపూర్తి మహోత్సవం
ఒకే వేదికపై కుటుంబ సభ్యులు
చిత్రం న్యూస్,నేరడిగొండ: ఆదిలాబాద్ జిల్లా నేరడిగొండ మండలంలోని కుమారి గ్రామంలో పెంట రాజన్న- రుక్మాబాయిలకు షష్టిపూర్తి నిర్వహించారు. రాజన్న (95) రుక్మాబాయి (90) దంపతులకు ముగ్గురు కుమారులు, ఆరుగురు కుమార్తెలు. కోడళ్ళు, అల్లుళ్ళు, మనుమలు, మనుమరాలు, మునిమనుమలు ఇలా అంత కలిపి 68 మంది కుటుంబ సభ్యులు ఉన్నారు. అయితే తాతకు- అమ్మకు షష్టిపూర్తి చేయాలని అనుకున్నారు. ఆదివారం ఘనంగా షష్టిపూర్తి నిర్వహించి తాత -అమ్మకు పెళ్లి కార్యక్రమం నిర్వహించి అన్నదాన కార్యక్రమం చేశారు. మొత్తం కుటుంబ సభ్యులు ఒకే వేదికలో ఇలా కలవడం చాలా సంతోషంగా ఉందని, అందరూ కలిసి ఉండాలని రాజన్న – రుక్మాబాయిలు కుటుంబ సభ్యులను దీవించారు. ఇందులో పెంట రమణయ్య, పెంట ప్రభాకర్, పెంట పెద్దక్క, మండల చిన్నమ్మి, పొట్టవతి ప్రేమల, వేముల కల, గాండ్ల రాజమణి, మెరుగు విజయలక్ష్మి,-స్వామి, పెంట కల్పనా- సునీల్, మండల ప్రేమల -ప్రవీణ్, మండల స్రవంతి – నవీన్, వేముల శ్రీకాంత్, పొట్టవతి సాయికిరణ్. గాండ్ల హర్షవర్ధన్, అవినాష్, మణికంఠ, లాస్మన్న, శంకర్, రాజేశ్వర్, లక్ష్మణ్, స్పందన, మనశ్విని,విగ్నేష్,తదితరులు కుటుంబ సభ్యులు ఉన్నారు.

