Chitram news
Newspaper Banner
Date of Publish : 05 October 2025, 11:05 am Editor : Chitram news

బాసరలో దొంగల బెడద

బాసరలో దొంగల బెడద

* బిక్కుబిక్కుమంటూ అర్ధరాత్రి కాలం వెళ్లదీస్తున్న కాలనీవాసులు

* గస్తీ చేపడుతున్న గ్రామస్తులు

          చిత్రం న్యూస్, బాసర:

నిర్మల్ జిల్లా బాసరలోని శ్రీ వెంకటేశ్వర కాలనీలో ఇటీవల వరుసగా దొంగతనాలు కావడంతో కాలనీవాసులు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. పలు కాలనీలోని ఇళ్లలోకి దొంగలు చొరబడి విలువైన వస్తువులతో పాటు నగదు, బంగారు ఆభరణాలను ఎత్తుకొని పోయారు. ఇదే క్రమంలో మరోసారి అదే కాలనీలో వరుసగా చోరీ జరగడంతో బిక్కుబిక్కుమంటూ కాలనీవాసులు కాలం వెళ్లదీస్తున్నారు. పోలీసులు గస్తీ తిరుగుతున్నప్పటికీ అడపాదడప చోరీ ఘటనలు జరుగుతూనే ఉన్నాయి. దీంతో వెంకటేశ్వర కాలనీవాసులు అందరూ ఏకమై అర్ధరాత్రి సమయంలో 5 గురు మంది చొప్పున యువకులు గస్తీ తిరుగుతున్నారు. ఏ సమస్య వచ్చిన ఒకరికొకరు సమాచారం తెలుసుకొని కంటిమీద కునుకు లేకుండా కాలనీలో గస్తీ ముమ్మరం చేశారు. ఇప్పటికే దొంగలపాలై తీవ్రంగా నష్టపోయిన వారిని పట్టించుకునే వారు కరువయ్యారని వాపోతున్నారు. కూత వేటు దూరంలో పోలీస్ స్టేషన్ ఉన్నప్పటికీ దొంగతనాలు జరుగుతున్నాయని, పోలీసులు దొంగలను పట్టుకోవాలని గ్రామస్తులు కోరుతున్నారు.