రెడ్డి సంఘం ఆధ్వర్యంలో బతుకమ్మ సంబరాలు
చిత్రం న్యూస్, బోథ్:
ఆదిలాబాద్ జిల్లా బోథ్ మండలంలో రెడ్డి మహిళ సంఘం ఆధ్వర్యంలో బతుకమ్మ సంబరాలు ఘనంగా చేపట్టారు. ఆడపడుచులు తొమ్మిది రోజుల పాటు బతుకమ్మ ఆడారు. పార్వతి దేవిని ఆరాధించడానికి, ఆమె ఆశీర్వాదాలు పొందడానికి ఈ పండుగ జరుపుకుంటామని మహిళలు పేర్కొన్నారు. ఈ పండగలో మహిళలు రంగురంగుల పూలతో బతుకమ్మ (పువ్వుల గుట్ట)ను అలంకరించి, దాని చుట్టూ పాటలు పాడుతూ, నృత్యాలు చేశారు. అనంతరం భక్తితో బతుకమ్మను గంగమ్మ ఒడికి చేర్చారు. బతుకమ్మా.. మళ్ళీ రావమ్మా అంటూ వేడుకున్నారు.
