విగ్రహ ప్రతిష్ఠాపనకు సతీష్ పవార్ నగదు అందజేత
భైరందేవ్ ఆలయ నూతన విగ్రహ ప్రతిష్టాపనకు, మహా అన్నదాన కార్యక్రమానికి రూ.10,100. నగదు అందజేస్తున్న అడానేశ్వర్ ఫౌండేషన్ ఛైర్మన్, బీఆర్ఎస్ పార్టీ యువ నాయకులు సతీష్ పవార్
చిత్రం న్యూస్, బేల: ఆదిలాబాద్ జిల్లా బేల మండలంలోని సదల్పూర్ గ్రామ శివారులో శాతవాహనుల కాలంలో నిర్మించిన భైరందేవ్ ఆలయ నూతన విగ్రహ ప్రతిష్టాపన ఈ నెల 12న నిర్వహించే కార్యక్రమానికి తన వంతు సహాయంగా అడానేశ్వర్ ఫౌండేషన్ ఛైర్మన్, బీఆర్ఎస్ పార్టీ యువ నాయకులు సతీష్ పవార్ రూ.5,100 నగదును, మహా అన్నదాన కార్యక్రమానికి మరో రూ.5 వేలు శనివారం ఆలయ కమిటీ సభ్యులకు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రతి ఒక్కరూ ఆధ్యాత్మిక మార్గంలో నడవాలని అన్నారు. ఆధ్యాత్మిక కార్యక్రమాలు ఎక్కడున్నా తమ వంతు సహాయ సహకారాలు ఎల్లప్పుడూ ఉంటాయని సతీష్ పవార్ పేర్కొన్నారు. ఈ కార్యక్రమానికి తన వంతు సహాయంగా నగదు అందజేసిన సతీష్ పవార్ కు ఆలయ కమిటీ సభ్యులు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ అధ్యక్షులు కొరంగే శ్యాంరావు, ఉప అధ్యక్షులు మెస్రం వాసుదేవ్, జనరల్ సెక్రటరీ సిడం ఖుశాల్, భీంరావుకొడప, సంజయ్ నిపుంగే, మరాఠా తిరిలే కున్భీ సమాజ్ అధ్యక్షులు విఠల్ రౌత్, వెంకటి తదితరులు పాల్గొన్నారు.
