బాసర గోదారమ్మ ఒడికి దుర్గామాతలు
*తొమ్మిది రోజులు పూజలు అందుకున్న అమ్మవారికి వీడ్కోలు పలుకుతున్న భక్తులు
చిత్రం న్యూస్, బాసర: నిర్మల్ జిల్లా బాసర పవిత్ర పుణ్యక్షేత్రం గల గోదారమ్మ ఒడికి దుర్గామాతలు చేరాయి. వివిధ అలంకారాల్లో కొలువుదీరిన అమ్మవారు తొమ్మిది రోజులు విశేషంగా పూజలు అందుకన్నారు. భక్తులు అమ్మవారికి ఘనంగా వీడ్కోలు పలికారు. గోదావరి వంతెనపై వివిధ ప్రాంతాల నుండి నిజామాబాదు, కరీంనగర్, కామారెడ్డి, బైంసా ఇతర ప్రాంతాల నుంచి గోదావరి నదికి భారీగా నిమజ్జనం కోసం దుర్గాదేవి విగ్రహాలు తరలివచ్చాయి. నదిలో నీటి ప్రవాహం ఎక్కువగా ఉండటంతో ఘాట్లు బురదమయంగా మారడంతో భక్తులు చాలా ఇబ్బందిపడ్డారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా రెవెన్యూ, పోలీస్ సిబ్బంది, ఆలయ అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు.

