పేదింటి బిడ్డకు ప్రభుత్వ కాలేజీలో ఎంబీబీఎస్ సీటు
చిత్రం న్యూస్, భైంసా: మండలంలోని వాలేగాం గ్రామానికి చెందిన కంమ్లె శైలజ నల్లగొండలోని ప్రభుత్వ మెడికల్ కాలేజీలో ఎంబీబీఎస్ సీటు సాధించినట్టు తల్లిదండ్రులు పేర్కొన్నారు. తండ్రి పరుశురాం మోటార్ మెకానిక్ చేస్తూ తల్లి అనిత బీడీ కార్మికురాలిగా పనిచేస్తుంది. వీరికి ఒక కూతురు, ఓ కుమారుడు ఉన్నారు. కుమారుడు కంమ్లె శరత్ ఇంటర్ చదువుతున్నాడు. కూతురు కంమ్లె శైలజ పట్టుదలతో చదివి నల్లగొండలోని ప్రభుత్వ మెడికల్ కాలేజీలో ఎంబీబీఎస్ సిటు సాధించడంతో ఆమెకు యువకులు, కంమ్లె సాయినాథ్, సిహెచ్ ఎల్లన్న, కారోబారి భూమన్న, ఎమ్మార్పీఎస్ కుంటాల మండల అధ్యక్షుడు కత్తి బాబు, కదం మారతి, దగ్డే దీపక్, కదం ఆనంద్, శాలువాతో సత్కరించారు. ఈ విషయం తెలుసుకొని గ్రామస్తులు, బంధు మిత్రులు అభినందనలు తెలిపారు.

