అంగరంగ వైభవంగా దుర్గమ్మ శోభా యాత్ర
చిత్రం న్యూస్, బాసర: నిర్మల్ జిల్లా బాసర మండల కేంద్రంలో కీర్గుల్ (కె) గ్రామంలో అంగరంగ వైభవంగా దుర్గమాత శోభాయాత్ర ఘనంగా నిర్వహించారు. నవరాత్రి ఉత్సవాల్లో దుర్గమాత అమ్మవారు తొమ్మిది రోజులు రోజుకో అలంకారంలో భక్తులకు దర్శనం ఇచ్చారు. అమ్మవారిని తొమ్మిది రోజులు తీరొక్క పూలతో వివిధ రకాల నైవేద్యం అమ్మవారికి సమర్పించారు. నవరాత్రి ఉత్సవాలు ముగింపు సందర్భంగా గురువారం రోజున విశేషంగా ఆకట్టుకుంది. అమ్మవారి శోభాయాత్రలో మహిళలు, ఆడపడుచులు బతుకమ్మ కోలాటాలతో భక్తిశ్రద్ధలతో అమ్మవారికి డీజే నడుమ శోభాయాత్రను ఘనంగా జరుపుకున్నారు. గ్రామస్తులు చల్లంగా ఉండాలని అమ్మవారిని వేడుకున్నారు. ఈ కార్యక్రమంలో వీడీసీ పెద్దలు, సభ్యులు, గ్రామ యువకులు, గ్రామస్తులు దుర్గమ్మ వెళ్ళి రావమ్మా అంటూ గంగమ్మ ఒడికి సాగనంపారు.

