ఆర్ఎస్ఎస్ ఆధ్వర్యంలో సొనాలలో విజయదశమి వేడుకలు
చిత్రం న్యూస్, సొనాల: ఆదిలాబాద్ జిల్లా సొనాలలో రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్(ఆర్ఎస్ఎస్) ఆధ్వర్యంలో మంగళవారం సొనాలలో విజయదశమి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా కే.గణేష్, వక్తగా జిల్లా ప్రచార ప్రముఖ్ శ్రీనాథ్ హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. సమాజాన్ని సంఘటితం చేస్తూ దేశాన్ని ఉన్నత స్థానంలో ఉంచడానికి ఆర్ఎస్ఎస్ పనిచేస్తుందని, దేశంలో ఎలాంటి విపత్కర పరిస్థితులు వచ్చిన ఆర్ఎస్ఎస్ ముందుండి తన సహాయక చర్యలు నిర్వహిస్తుందని, పంచ పరివర్తన సూత్రాలను పాటించాలన్నారు. స్వదేశీ స్వావలంబన దిశగా మనందరం అడుగులు వేయాలని, అందరూ సంఘటితoగా ఉండాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో కండ కార్యవహా కోస్మెట్ శుద్ధోధన్, జిల్లా ధర్మ జాగరణ ప్రముఖ్ ఉత్తర్వార్ నాగేందర్, స్వయం సేవకులు, గ్రామస్థులతో పాటు చుట్టుపక్కల గ్రామాల ప్రజలు, పిల్లలు, యువకులు, పాల్గొన్నారు.
…
