బాసర నుంచి మహోర్ జాతీయ రహదారి నిర్మాణానికి సర్వే చేపట్టండి
*ఎమ్మెల్యేకు లేఖ రాసిన కేంద్ర మంత్రి నితిన్ గడ్కరి
చిత్రం న్యూస్, బాసర: నిర్మల్ జిల్లా బాసర నుంచి మహోర్ హిమాయత్ నగర్ వరకు రెండు జాతీయ రహదారులను అనుసంధానం చేస్తూ జాతీయ రహదారి నిర్మాణానికి సర్వే చేపట్టాలని కేంద్ర ప్రభుత్వం సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేసింది. ఈ విషయాన్ని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరి ముథోల్ ఎమ్మెల్యే పవార్ రామారావు పటేల్ కు లేఖ ద్వారా వివరించారు. గత మే నెల 5 న ఎమ్మెల్యే పవార్ రామరావు పటేల్ ఈ విషయంలో కేంద్ర మంత్రి నితిన్ గడ్కరిని కలిశారు. జాతీయ రహదారిని అనుసంధానం చేస్తే బాసర అమ్మ వారి క్షేత్రం నుండి మహోర్ రేణుక మాత టెంపుల్ కు ఆధ్యాత్మిక మార్గం ఏర్పడుతుందని విన్నవించారు. స్పందించినందుకు ఎమ్మెల్యే రామారావు పటేల్ కేంద్ర మంత్రి నితిన్ గడ్కరికి కృతజ్ఞతలు తెలిపారు.
<img class="aligncenter wp-image-5557 size-full"src=https://chitramnews.com/wp-content/uploads/2026/03/3958e92009bc40ddb4a9035dd59af409-3.jpg alt="" width="914" height="733" /


