శ్రీ మహా గౌరీ దేవి అలంకారంలో భక్తులకు దర్శనం
*మూల నక్షత్రం సందర్భంగా బాసరలో భక్తుల సందడి
చిత్రం న్యూస్, బాసర: నిర్మల్ జిల్లా బాసర పుణ్యక్షేత్రంలో భక్తుల రద్దీ నెలకొంది. శ్రీ జ్ఞాన సరస్వతి అమ్మవారి మూల నక్షత్రం శుభదినం సోమవారం కావడంతో అమ్మవారి సన్నిధిలో భక్తుల సందడి కనిపిస్తుంది. శ్రీ శరన్నవరాత్రి ఉత్సవాలు ఎనిమిదవ రోజు శ్రీ మహా గౌరీ దేవి అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు. వైదిక బృందం అమ్మవారికి చక్కెర పొంగలిని నైవేద్యంగా సమర్పించారు. ఆలయానికి భక్తులు వేకువజాము నుంచి గోదావరి నదిలో పుణ్యస్నానమాచరించి అమ్మవారి దర్శనానికి క్యూ కట్టారు. దర్శనానికి గంటల సమయం పట్టింది. క్యూలో నిలబడ్డ వారికీ ఆలయ అధికారులు పాలు, బిస్కెట్లు పంపిణీ చేశారు. మంచి నీరు అందించేందుకు ఏర్పాటు చేశారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఆలయ ఈవో అంజనీ దేవి, ముథోల్ సీఐ మలేష్, ఎస్సై బి.శ్రీనివాస్ భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.
