ప్రిన్సిపాల్ వరప్రసాద్ కు మాతృ వియోగం
* ప్రముఖుల పరామర్శ
చిత్రం న్యూస్, బేల: ఆదిలాబాద్ జిల్లా బేల కీర్తన డిగ్రీ కాలేజీ ప్రిన్సిపల్ డా. వేముగంటి వరప్రసాదరావు కు మాతృ వియోగం కలిగింది. ఆయన పెద్దమ్మ వేముగంటి మనోహారమ్మ ఈ నెల 24 న అనారోగ్యంతో మరణించారు. ఈ సందర్భంగా ఆయనతో పాటు ఆయన సోదరుడిని ప్రముఖులు పరామర్శించారు. మానకొండూర్ శాసన సభ్యులు డా. సత్యనారాయణ, పీసీసి సభ్యులు బత్తిని శ్రీనివాస్ గౌడ్, రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు హర్కర వేణుగోపాల్ రావు సోదరుడు హర్కర ప్రసాదరావు పరామర్శించారు. కుటుంబ సభ్యులకి ప్రగాఢ సానుభూతి తెలిపారు.
